బాగల్కోట్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా ఇలాకల్లో భారీ అగ్న ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి సమీపంలోని బసవేశ్వర సర్కిల్ ఎదురుగా ఇటీవల నిర్మించిన ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఈ కాంప్లెక్స్‌లో హార్డ్‌వేర్, ఇతర దుకాణాల్లోకి మంటలు వ్యాపించి.. కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.