వైరల్​: పర్యటకులను ఛేజ్​ చేసిన ఏనుగు - తల్లి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2019, 4:11 PM IST

కర్ణాటక మైసూర్​లోని నాగర్​హొల్​ జాతీయ పార్కులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అటవీ జంతువులను చూడటానికి వాహనంలో బయలుదేరారు పర్యటకులు. దారిలో ఓ ఏనుగుల గుంపు వారికి కనపడింది. వెంటనే ఆ గుంపును ఫొటో తీయడానికి చరవాణీలు బయటకు తీశారు. ఇది గమనించిన ఏనుగులు ఏదో ఆపద పొంచి ఉందనుకుని భయపడ్డాయి. గుంపులోని తల్లి ఏనుగు వెంటనే అప్రమత్తమై వాహనం వైపు పరుగు తీసింది. ఈ దృశ్యాలు పర్యటకుల ఫోన్లలో చిక్కాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.