Liquid Diet: బరువు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా మారింది. బరువు అదుపులో ఉండేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేసినా.. డైట్ కంట్రోల్ చేసినా.. కొందరిలో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అందుకు ప్రస్తుత రోజుల్లో చాలా మంది లిక్విడ్ డైట్‌ను పాటిస్తున్నారు. కొందరు బరువు తగ్గడం కోసం కొన్ని నెలలపాటు చాలా సీరియస్‌గా చేస్తున్నారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం సమాధానమిచ్చారంటే?
"సాధారణంగా చాలా మంది లిక్విడ్ డైట్ తీసుకుంటే బరువు తగ్గిపోతాము అనుకుంటారు. అలా చేస్తే తగ్గే అవకాశముంది. కానీ ఎక్కువ రోజులు లిక్విడ్ డైట్ పాటించకూడదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వచ్చి తీరతాయి. లిక్విట్ డైట్ పాటించేవారు పండ్లను రసాల రూపంలో తీసుకుంటారు. అయితే జ్యూస్ చేసేటప్పుడు అందులో ఉండే చాలా పోషకాలు పోతాయి. అందుకే వాటి వల్ల పెద్దగా లాభం ఉండదు. కొబ్బరి నీరు, బాదం మిల్క్, సోయా మిల్క్ వంటివి అధిక మొత్తంలో తీసుకోవచ్చు. అవి కూడా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తాగాలి. రోగాల బారిన పడిన వారు.. వైద్యుల సలహా మేరకు మాత్రమే లిక్విడ్ డైట్‌ను పాటించాలి."
-- డా. శ్రావ్య, డైటీషియన్
ఎలాంటి సమయంలో లిక్విడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి?.. "దంత సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, నోటి లోపల పుండ్లు ఏర్పడినప్పుడు, ఆపరేషన్లు జరిగే మందు, తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవాలి. వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి లిక్విడ్స్‌ను ఎక్కవగా తీసుకోవాలి. పేగు సంబంధింత వ్యాధులు, మలబద్దకం బారిన పడినప్పుడు, జీర్ణాశయానికి సంబంధించి ఏవైనా పరీక్షలు చేయించుకునేటప్పుడు ద్రవ పదార్థాలను అధిక మొత్తంలో తీసుకోవాలి" అని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: ఈ సింపుల్ టిప్స్‌తో ముఖంపై మొటిమలు మాయం!