ETV Bharat / sukhibhava

ఆదుర్దా.. ఆందోళన.. భయం.. మితిమీరితే? - panic attacks

ఒకింత ఆదుర్దా మంచిదే. మనల్ని అప్రమత్తం చేస్తుంది. కాసింత ఆందోళన మంచిదే. పనుల్లో వేగం పెంచుతుంది. రవ్వంత భయం మంచిదే. ప్రమాదాల బారినపడకుండా కాపాడుతుంది. కానీ ఇవి మితిమీరితే? మనసు మీద పెత్తనం చెలాయిస్తే? లేనిపోని భయాలకు తావిస్తాయి. నలుగురిలోకి వెళ్లనీయకుండా కట్టడి చేస్తాయి. శారీరకంగానూ జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.

how to get rid of panic attacks and anxiety disorders
ఆదుర్దా.. ఆందోళన.. భయం.. మితిమీరితే?
author img

By

Published : Nov 10, 2020, 12:34 PM IST

చిన్న పిల్లవాడు స్కూల్‌ నుంచి ఇంటికి రాలేదు. పడక కుర్చీలో కూర్చొని పేపర్‌ చదువుతున్న తాత మనసులో ఆదుర్దా మొదలైంది. మాటిమాటికీ గడియారం వంక చూడటం, వీధి గుమ్మం కేసి పరికించడం. సమయం 4.45 అయ్యింది. ఆదుర్దా కాస్తా ఆందోళనగా మారిపోయింది. కుర్చీలోంచి లేచి వీధి గుమ్మం దగ్గరికి వెళ్లడం, అటూఇటూ చూడటం, ఇంట్లోకి రావటం. మనసులో తీవ్ర ఆందోళన. మరో పావుగంట గడించింది. ఆందోళనతో కూడిన భయం (పానిక్‌) మొదలైంది. అంతే.. నడిచో, సైకిలో, మోపెడో, స్కూటరో తీసుకొని స్కూలుకు బయలుదేరటం. భయం ఎక్కువై పిచ్చి పిచ్చి ఆలోచనలూ! ‘పిల్లవాడికి ఏమైందో ఏమో? స్కూలు రిక్షా ప్రమాదానికి గురైందా? పిల్లవాడు పడిపోయాడా? కాలో, చెయ్యో విరగలేదు కదా.’ అంతలో దుఃఖం. ఆందోళన, భయం ఎక్కువై ఆలోచనల మీద అదుపు తప్పిపోయింది. కనిపించిన వారందరినీ ఒకటే అడగటం. మనిషిని పూర్తిగా భయం వశం చేసేసుకుంటుంది. మనమంతా ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఉంటాం. ఆదుర్దా, ఆందోళన సహజం. ఇవి ఒక మాదిరిగా ఉండటం మంచిదే.

పరీక్షలు వచ్చేస్తున్నాయని పిల్లలు ఆదుర్దా పడితే మరింత బాగా సన్నద్ధమవుతారు. ఇంకాస్త ఏకాగ్రతతో చదువుతారు. ఇలా ఒక విధంగా మేలే చేస్తాయి. కానీ ఇవే ఎక్కువైతే, శ్రుతిమించితే ఆందోళన సమస్యలుగా (యాంగ్జయిటీ డిజార్డర్స్‌), భయాలుగా (ఫోబియా), తీవ్ర భయాందోళనగా (పానిక్‌ అటాక్‌) మారిపోతాయి. ఇవి రోజువారీ జీవితం మీద విపరీత ప్రభావం చూపుతాయి. భయాందోళనతో తాము ఇబ్బంది పడటమే కాదు.. ఇంట్లో వారికీ చిక్కులు తెచ్చిపెడతారు.

ఏంటీ ఫోబియా?

ఫోబియా అంటే ఏదైనా ఒక పరిస్థితికి అనూహ్యంగా భయపడిపోవటం. ఎవరూ భయపడని, ఎవరికీ భయం కలిగించని వాటికి భయపడిపోవటం ఇందులో చూస్తుంటాం. ఒకరకంగా ఇది అర్థం లేని భయం. కొందరు చాలా చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోతుంటారు. అది అనవసరమైన భయమని ఒకపక్క తెలుస్తూనే ఉంటుంది. అయినా తమకు భయం కలిగించేవి ఎదురైనప్పుడు విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. దీంతో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి వెనకాడుతుంటారు. వీలైనంతవరకు వాటిని తప్పించుకోవటానికే ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు- కొంతమందికి డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటే భయం. ఏం జబ్బు ఉందని చెబుతారో, రక్త పరీక్షకు సూది గుచ్చుతారేమో, రక్తం తీస్తారేమో, ఇంజెక్షన్‌ ఇస్తారేమో అని వణికిపోతుంటారు. అలాగని డాక్టర్‌ దగ్గరకు వెళ్లకుండా ఉండాలన్నా భయమే. లోపల ఏదైనా జబ్బు ఉందేమో, దాన్ని తెలుసుకోలేకపోతే ముదిరిపోతుందేమో.. ఇలా అన్నింటికీ భయమే. కొందరికి ఇంట్లో తిరిగే బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులను చూస్తే భయం. అవి ఉంటే గదిలోకి వెళ్లనే వెళ్లరు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటుంటారు. బలవంతంగా వెళ్లాల్సి వస్తే తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు.

ప్రమాదకరమైన భయం

కొందరికి నలుగురిలోకి వెళ్లాలంటే భయం. నలుగురిలో సరిగా ఉండకపోతే, మాట్లాడలేకపోతే అపహాస్యం పాలవుతామోననే భయం. అంతా తమను చూసి నవ్వుతారేమో, వాళ్లు నవ్వుకునేలా తామేమైనా చేస్తామేమోనని భయపడి పోతుంటారు. సాధారణంగా ఇలాంటి భయం విద్యార్థుల్లో ఎక్కువగా చూస్తుంటాం. టీచరు అడిగిన ప్రశ్నకు జవాబు తెలిసినా చెప్పటానికి జంకుతుంటారు. జవాబు తప్పయితే అందరూ నవ్వుతారేమోననే భయం. టీచరు తిడతారేమోననే భయం. కొందరికి పెద్దయ్యాకా ఇలాంటి భయాలు పోవు. నలుగురిలోకి వెళ్లాలంటే విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. చెమటలు పడుతుంటాయి. గుండె దడదడగా కొట్టుకుంటుంది. ఎగరొప్పుతో ఉంటారు. దీంతో ఎక్కడికీ వెళ్లరు. షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటికి దూరంగా ఉంటారు. సమావేశాలకు వెళ్లరు. సినిమాలు చూడరు. ఇంట్లో గదిలోనే ఉండిపోవాలని చూస్తుంటారు. బయటకు వెళ్లటానికి ఇష్టపడరు. ఇలాంటి సామాజిక భయాల్లో ప్రమాదకమైంది అగొరఫోబియా. వీరికి ఒంటరిగా ఉండాలన్నా భయమే, గుంపులో ఉన్నా భయమే. దీని ముఖ్య లక్షణాలు ఇవీ..

* ఒక్కరే, ఒంటరిగా ఉండలేకపోవటం

* ఒక్కరే ఉన్నప్పుడు అక్కడ్నుంచి ఎలా బయటపడాలోనని ఆలోచించటం

* అక్కడ్నుంచి బయటపడకపోతే ఏమైపోతుందో అని ఆందోళన పడటం

* చనిపోతానేమోనని భయపడటం

* గుంపులో ఉంటే, అమ్మో ఎలా బయటపడాలోనని అనుకోవటం

* ఆరుబయట పడుకుంటే ఏమైపోతానోనని ఆందోళన పడటం

ధైర్యమే ఔషధం

మామూలు భయాలు గలవారు నిదానంగా తమకు తామే వాటి నుంచి బయటపడతారు. కావాల్సిందల్లా ధైర్యం నూరిపోయటం. ఉదాహరణకు- తరగతిలో భయపడిపోయే పిల్లలను గుర్తిస్తే వారిని ఉపాధ్యాయులు జవాబు చెప్పేలా ప్రోత్సహించాలి. అపహాస్యం చేయకూడదు. ఇది పిల్లల్లో ధైర్యాన్ని నూరిపోస్తుంది. భయం పోతుంది. ఇంట్లో వాళ్లు ధైర్యం చెబితే నిదానంగా తగ్గిపోతుంది. ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడేవారికి ఇంట్లో వాళ్లు, స్నేహితులు, డాక్టర్లు, నర్సులు ధైర్యం చెబితే భయాలు పోతాయి. తమకుతామే నిదానంగా భయాల నుంచి బయటపడతారు. ఎవరికివారే ధైర్యం చెప్పుకోవటం కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వారు గానీ స్నేహితులు గానీ భయపడేవారిని గేలి చేయకూడదు. అలా చేస్తే ఆత్మన్యూనతకు లోనవుతారు. నలుగురిలోకి వెళ్లకుండా, కలవకుండా, మాట్లాడకుండా ఒంటరితనం అలవాటు చేసుకునే ప్రమాదముంది. ఇది మున్ముందు ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.

* భయాందోళనలు తీవ్రమైతే ఒకోసారి ప్రమాదకరమైన పనులూ చేయొచ్చు. అందువల్ల ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని అవసరమైతే మానసిక వ్యాధి నిపుణులకు చూపించటం, చికిత్స చేయించటం చాలా అవసరం. సరైన చికిత్స చేస్తే భయాలు చాలావరకు పూర్తిగా తగ్గిపోతాయి. ఆందోళన, కుంగుబాటును తగ్గించే మందులు, మానసిక ధైర్యాన్ని కలిగించే మాటలు, పద్ధతులు ఎంతగానో మేలు చేస్తాయి.

అకారణ జబ్బులు కూడా..

కొందరికి ఆందోళన, భయం వల్ల జబ్బులూ తలెత్తొచ్చు (సోమటైజేషన్‌ డిజార్డర్స్‌). ప్రధానంగా గుండెదడ, ఆయాసం, కడుపునొప్పి, నడుం నొప్పి, తలనొప్పి, కాళ్లు చేతులు బండబారిపోవటం, తిమ్మిర్లు, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సమస్యేంటో తెలియక ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. డాక్టర్లనూ నిందిస్తుంటారు. సరిగా చూడలేదని డాక్టర్లను మారుస్తూ ఉంటారు. స్పెషలిస్టుల కోసం, సూపర్‌ స్పెషలిస్టుల కోసం వాకబు చేస్తుంటారు. ఎంతదూరమైనా వెళ్లి కలవందే ఊరుకోరు. కొన్నిసార్లు అనవసరంగా ఆపరేషన్లు చేయించుకుంటారు. అయినా తగ్గదు.

* ఇలాంటివారి విషయంలో నిదానం అవసరం. తాము పడుతున్న బాధలను, తీసుకున్న వైద్యాన్ని డాక్టరుకు విపులంగా విశదీకరిస్తే.. డాక్టర్‌ కూడా ఓపికగా వినగలిగితే తప్పక వ్యాధి నిర్ధారణ అవుతుంది. అసలు సమస్యేంటో తేలిపోతుంది. మనో నిబ్బరం కలిగించేలా చూస్తే చాలావరకు కుదురుకుంటుంది.

తీవ్ర భయాందోళన

ఉన్నట్టుండి దాడిచేసే భయాందోళన (పానిక్‌ అటాక్‌) మనిషిని విపత్కర పరిస్థితిలోకి నెట్టేస్తుంది. చేసేది మంచో, చెడో అన్న విచక్షణ లేకుండా పోతుంది. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఇది ఎక్కువైంది. బయటకు వెళ్లాలంటే భయం. ఇంట్లో ఉండాలంటే దిగులు. సహజంగా మనం సంఘ జీవులం. నలుగురితో కలవటం, మాట్లాడటం మన నైజం. అదిప్పుడు తగ్గిపోయింది. ముఖ్యంగా పెద్ద వయసువారినిది బాగా కుంగదీస్తోంది. పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ఊళ్లలో ఉంటారు. కొందరి పిల్లలైతే విదేశాల్లో ఉంటారు. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారోననే బెంగ. తాము ఏమైపోతామోననే దిగులు. తమకి ఏమైనా అయితే ఎవరు చూస్తారనే ఆందోళన. ఏం చెయ్యాలోననే ఆదుర్దా. ఇవన్నీ రాత్రిపూట ఇంకాస్త ఎక్కువవుతాయి. పగలు చుట్టుపక్కల జన సంచారం ఉంటుంది. బయట వెలుతురు ఉంటుంది. ఎలాగో కాలక్షేపం అవుతుంది. రాత్రి అయ్యేసరికి చుట్టూరా చీకటి. ఒక విధమైన భయం కలుగుతుంది. నిద్ర పట్టదు. పిచ్చి ఆలోచనలు, ఆందోళన, భయం, గాబరా అయిపోయి ఇంట్లో వాళ్లని కంగారు పెట్టటం. తాము అవస్థ పడటం జరుగుతుంది.

ఏం చేయాలి?

భయం, ఆందోళన తగ్గటానికి మనో నిబ్బరం ముఖ్యం. మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి. పెద్దవారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవొచ్చు. టీవీలో హింసాత్మక సినిమాలు చూడొద్దు. ప్రశాంతత, ఆనందం కలిగించే హాస్య సినిమాలు చూడాలి. రాత్రిపూట కొవిడ్‌ వార్తలు చూడొద్దు. కొవిడ్‌ భయాందోళనతో ప్రాణాలు తీసుకుంటున్నట్టు పత్రికల్లో చదువుతున్నాం. ఇలాంటి అఘాయిత్యాలు చేయొద్దు. మాస్కు ధరించటం, దూరంగా ఉండి మాట్లాడటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవటం వంటి వాటితో కరోనా బారినపడకుండా చూసుకోవచ్చని తెలుసుకోవాలి. కొవిడ్‌ వచ్చినా చాలామంది కోలుకొని, క్షేమంగా ఉంటున్నారనే సంగతి గుర్తించాలి.

హెచ్చరిక:

చాలామంది ఆందోళన, భయాలు ఉన్నవారు తమకుతామే నిద్ర మాత్రలు కొనుక్కొని వేసుకుంటుంటారు. మద్యం తాగుతుంటారు. ఇది తగదు. వీటికి అలవాటు పడిపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అవసరమైతే ఏమాత్రం సంకోచించకుండా మానసిక నిపుణులతో తగు చికిత్స తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.