ETV Bharat / state

దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లిన అరుణ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.  శ్రీకాంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ద్విచక్ర వాహనంపై యాదాద్రి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
author img

By

Published : Apr 19, 2019, 5:40 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే యువతి మృతిచెందగా, యువకుడు గాయాలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలో చదువుతున్న అరుణ తన స్నేహితుడు శ్రీకాంత్​తో కలిసి యాదాద్రి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. అరుణ శరీరంపై నుంచి కారు దూసుకెళ్లటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అరుణ నల్లకుంట, శ్రీకాంత్ ముషీరాబాద్​ వాస్తవ్యులుగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువతీ

ఇవీ చూడండి : ఏనుగు దాడిలో ఐదుగురు మృతి

స్లగ్: TG_NLG_61_19_ACCIDENT_AV_C14 రిపోర్టర్: శ్రీపాద సతీష్ సెంటర్: భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి ఘటన స్థలంలొనే మృతిచెందగా, మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నాంపల్లిలో చదువుతున్న అరుణ తన స్నేహితుడు శ్రీకాంత్ తో కలిసి యాదాద్రి దర్శనానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న స్కూటీ ని వెనుకనుండి వచ్చిన కారు ఢీకొనడంతో కిందపడ్డ అరుణ పై నుండి మరో కారు వెళ్లడంతో అరుణ సంఘటన స్థలంలొనే మరణించగా శ్రీకాంత్ కు గాయలయ్యాయి. శ్రీకాంత్ ను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అరుణ నల్లకుంట వాసవ్యురాలు కాగా, శ్రీకాంత్ ముషీరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అరుణ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.