యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాశవారి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న తుపాన్ వాహనాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లో ఓల్డ్ మేరి కళాశాలలో నర్సింగ్ చదువుతున్న సాయిచరణ్, తేజగౌడ్... శ్రీకర్ హాస్పిటల్లో పనిచేస్తున్న తిరుమలేశ్‌తో కలిసి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూర్ వద్ద ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మోత్కూరు కాశవారిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న తుపాన్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలవగా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులు సంగారెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ఇదీ చూడండి: 8 గంటల రెస్క్యూ... లోకోపైలెట్ సురక్షితం