భువనగిరి జిల్లాలోని రాయిగిరి నుంచి మోత్కూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు.
9 నెలల క్రితం పనులు మంజూరు అయినప్పటికీ కొవిడ్ కారణంగా టెండర్లు పిలవడంలో ఆలస్యమైంది. వారం క్రితం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి... పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు పనులు ప్రారంభంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.