ETV Bharat / state

భాజపాలో చేరిన మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి - భాజపాలోకిి మోత్కూర్​ ఎంపీపీ సంధ్యారాణి వార్తలు

మోత్కూరు ఎంపీపీ దీటి సంధ్యారాణి భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Motkuru MPP Sandhyarani   joined BJP
భాజపాలో చేరిన మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి
author img

By

Published : Sep 6, 2020, 10:02 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ దీటి సంధ్యారాణి-సందీప్ దంపతులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భాజపాలో చేరారు. హైదరాబాద్​లోని కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీతోపాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు.

ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి తాను భాజపాలో చేరినట్లు ఎంపీపీ సంధ్యారాణి పేర్కొన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ. శ్యామ్ సుందర్ రావ్, జిల్లా ఇంఛార్జీ నరేందర్​రావ్, తుంగతుర్తి ఇంఛార్జీ కడియం రామ చంద్రయ్య, దాసరి మల్లేశం, నర్ల నర్సింగరావు, బొట్టు అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: వాటా సొమ్ముకోసం న్యాయ పోరాటానికైనా సిద్ధమే: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.