యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన పరిహారంలో చోటుచేసుకున్న అవకతవకలపై అధికారులు అంతర్గత విచారణ చేపడుతున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా... బాధితులకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు తెరపైకి వచ్చిన విషయాన్ని ఈటీవీ-ఈనాడు ఈ నెల 18న వెలుగులోకి తెచ్చాయి. జరిగిన పరిణామాలపై జిల్లా ఉన్నతాధికారులు... అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
అవసరమైతే ఇతర విభాగాలతో విచారణ నిర్వహించే అవకాశం కనపడుతోంది. ఆర్డీవో కార్యాలయం ద్వారా సాగినట్లుగా భావిస్తున్న వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు... మిర్యాలగూడ ఆర్డీవో పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అంతర్గత విచారణ వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి