ఈనెల 19న అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డి మృతదేహం స్వదేశానికి చేరుకుంది. ఈ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న మృతదేహాన్ని.. గోవర్ధన్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రహీంఖాన్‌పేటకు అధికారులు తరలించారు.
గోవర్ధన్‌రెడ్డి అమెరికాలోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈనెల 19న రాత్రి 8.30 గంటలకు స్టోర్‌లోకి చొరబడి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గోవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మృతుని స్వగ్రామం రహీంఖాన్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చూడండి :ఎన్కౌంటర్ చేయకండి