యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగి బావి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర చెట్టు కొమ్మల్లో తన రెండు కాళ్లు ఇరుక్కుపోయి ఓ వానరం చనిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వానరానికి దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే గ్రామ సర్పంచ్ రాంపాక నాగయ్య దగ్గర వెళ్లి విషయం చెప్పారు. సర్పంచ్ కూడా ఒప్పుకోవడంతో గ్రామస్థులంతా కలిసి కోతికి అంత్యక్రియలు చేశారు.
గ్రామంలో 2012 సంవత్సరంలో గ్రామస్థుల సహకారంతో ఆంజనేయ స్వామి గుడి నిర్మించామని... ఆలయం దగ్గరే కోతి చనిపోవడం వల్లే దహన సంస్కారాలు నిర్వహించినట్లు సర్పంచ్ నాగయ్య తెలిపారు. మనిషి చనిపోతే ఏ విధంగా చేస్తారో అదే విధంగా పాడే కట్టి, డప్పు చప్పుళ్ల మధ్య ఆడుతూ అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా