యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సభలో సీఎం కేసీఆర్తో సహా కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం అనారోగ్యం పాలైన ఆమెను.. కుటుంబ సభ్యులు చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుట పడటంతో ఇవాళ ఉదయం ఆగమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి స్వగ్రామానికి వెళ్లిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెద్దకొడుకంటూ ఆగమ్మ ధీమా..
వాసాలమర్రి(Vasalamarri)లో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. వృద్ధురాలు ఆగమ్మతో ముచ్చటించారు. మంచి, చెడులను అడిగి తెలుసుకున్నారు. ఆపాయ్యంగా ఆమెకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత వేదికపైనా ఆమెకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిని నేరుగా చూడటం, కలవడం, అందులోనూ మాట్లాడే అవకాశం రావడంతో ఆగమ్మ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. పెద్దకొడుకులా బాధలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: RAPE CASE: తాడేపల్లి అత్యాచారం ఘటనలో కొనసాగుతున్న నిందితుల వేట