ETV Bharat / state

వెండి గంగాళంలో నృసింహుడికి చక్రస్నానం - VEDA PRAYERS

యాదాద్రిలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి ఆలయంలో 11 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పదో రోజున స్వామివారికి పూర్ణాహుతి సమర్పించారు.

వెండి గంగాళంలో ప్రత్యేక జలాలతో పూజలు
author img

By

Published : Mar 17, 2019, 6:40 PM IST

Updated : Mar 17, 2019, 7:46 PM IST

వెండి గంగాళంలో స్వామి వారికి వైభవంగా చక్రస్నానం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వహించారు. స్వామి వారికి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిపించారు. బాలాలయంలో జరిగిన ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ప్రత్యేక జలాలను వెండి గంగాళంలో పోసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు చేశారు. అనంతరం స్వామి,అమ్మవార్లకు చక్రస్నానం చేయించారు.

ఆదివారం భక్తుల రద్దీ

ఈ సమయంలో భక్తులు సైతం పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. రేపు అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం సెలవుదినం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇవీ చూడండి :కారెక్కనున్న వనమా

sample description
Last Updated : Mar 17, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.