ETV Bharat / state

ఎయిర్​ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి.. కుటుంబీకుల అనుమానం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎయిర్​ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. పట్టణంలోని అంగడి బజారులో నివాసముండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి తాడిపత్రి వరప్రసాద్ (73) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. వరప్రసాద్​ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఎయిర్​ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి.. కుటుంబ సభ్యుల అనుమానం

author img

By

Published : Sep 26, 2020, 11:39 AM IST

Updated : Sep 26, 2020, 2:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎయిర్​ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం వేకువ జామున తన ఇంట్లోనే కుర్చీలో కూర్చొని.. సొమ్మసిల్లి ప్రమాదవశాత్తు ముందుకు పడ్డారు. ఈ క్రమంలో తలకు తీవ్రగాయమై మృతి చెందారు. పట్టణంలోని అంగడి బజారులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి తాడిపత్రి వరప్రసాద్ (73) నివాసముంటున్నాడు. గత ఎనిమిదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ, అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు.

వరప్రసాద్​ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. వరప్రసాద్​ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Sep 26, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.