యాదాద్రి జిల్లా మోత్కురు మండల కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో కరోనా విజృంభణ, లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు పాఠశాల టీచర్లను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ముందుకొచ్చిందని మోత్కూర్ కమిటీ వైస్ ఛైర్మన్ యాకూబ్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రైవేటు టీచర్లకు నెలకు 2000రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తూ అండగా నిలిచిందని వెల్లడించారు. ఇప్పటికే వీరి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యాయని… తెలిపారు.
ఇదీ చదవండి: పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్