ఎక్కువ డిజైన్లకు ఎక్కువ కష్టం
సాధారణంగా... జాకార్డ్ యంత్రాల్లో ఆకృతి(డిజైన్) కోసం అట్టముక్కలను ఏర్పాటు చేసుకొని కాలుతో యంత్రాన్ని తొక్కుతుంటేనే అది నడుస్తుంది. డిజైన్ కావాలంటే అట్టముక్కలు లోపల అమర్చాల్సి వచ్చేది. చీరపై రెండు మూడు రకాల డిజైన్లు వేయాలంటే ఒక్కో ఆకృతికి ఒక్కో రకమైన అట్టముక్కలను యంత్రంలో అనుసంధానించాల్సి వచ్చేది. దీనివల్ల జాకార్డు చీరల తయారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా మారింది.
తక్కువ శ్రమతో వీలైనన్ని డిజైన్లు
ఏ డిజైన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమోరీ కార్డులో పెట్టుకుని మార్చుకోవడానికి వీలుండేలా జాకార్డ్ యంత్రాన్ని తయారు చేశారు శ్రీనివాసరావు. మెమోరీ కార్డు నుంచి ఆకృతిని.. ఎలక్ట్రానిక్ యంత్రం తీసుకున్నప్పుడు అందులో అమర్చిన మైక్రో ప్రాసెసర్ ద్వారా చిన్న మోటార్లు నడుస్తాయి. దీని ద్వారా తక్కువ సమయంలో.... తక్కువ ఖర్చుతో సులువుగా వీలైనన్ని ఎక్కువ డిజైన్లతో వస్త్రాలను అందంగా నేయవచ్చు.
అందరికీ అందుబాటులో
బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి వసంత్‌రెడ్డి కూడా ఈ యంత్ర రూపకల్పనలో... శ్రీనివాసరావుతో కలసి పనిచేస్తున్నారు. యంత్రం కొనుగోలు ఖర్చు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.
శ్రమ తగ్గుతుంది
మరో రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేసి...ఆకర్షణీయమైన రీతిలో ఈ - జాకార్డ్ యంత్రం పూర్తిగా రూపొందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. దీని ద్వారా నేతన్నల శ్రమ తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు'