శాంతికి ప్రధాన కారణం నిజం, నిర్భయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తీ చలమేశ్వర్ అన్నారు. మనుషుల్లో ఎప్పుడైతే సమానత్వం లోపిస్తుందో... అప్పుడు అశాంతి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అసమానతలను తొలగించి శాంతియుతంగా ముందుకెళ్లాలని ఆయన సూచించారు. హన్మకొండలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన శాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత్ శాంతి దూత్ అవార్డులను ప్రదానం చేశారు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత, ఆసుయంత్ర సృష్టికర్త చింతకింది మల్లేషం, ప్రముఖ సీని గేయ రచయిత, గాయకులు సుద్దాల ఆశోక్ తేజ, జయరాజ్, ఉన్నత విద్య రొక్కం రాధాకృష్ణ, కేయూ ప్రొఫెసర్ సురేష్, శౌర్య చక్ర ఆవార్డు గ్రహీత శ్రీనివాస్‌కు భారత్ శాంతి దూత్ అవార్డులను అందజేశారు.
నిజం, నిర్భయమే శాంతికి మూలం:జస్టిస్ చలమేశ్వర్
నిజం, నిర్భయమే శాంతికి మూలమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. హన్మకొండలో జరిగిన వరల్డ్ పీస్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.