వరంగల్ పట్టణ జిల్లా కాజిపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్‌లు కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వరంగల్ నగరానికి కాజీపేట్ ముఖద్వారం వంటిదని వినయ్ భాస్కర్ అన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
కాజీపేట్ చౌరస్తాలో ట్రాఫిక్‌కి ఇబ్బందికరంగా మారిన చిరువ్యాపారుల దుకాణాల గురించి అధికారులతో మాట్లాడామన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా మరోచోట వారికి దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం