రైల్వే నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆలిండియా రైల్వే మెన్ ఫెడరేషన్ పిలుపు మేరకు సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు హెచ్చరిక వారంగా పాటిస్తున్నట్లు తెలిపారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు మజ్దూర్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు.
రైల్వేలో ప్రైవేటీకరణ ఆపాలని..నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 2005 సంవత్సరానికి ముందున్న పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాజీపేట్ డివిజన్లోని అన్ని విభాగాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీచూడండి:వీఆర్వో వీఆర్ఏ సంఘాల ధర్నా