ETV Bharat / state

'మీ పార్టీని మేము టార్గెట్​ చేయడం లేదు' - telangana news today

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్​ నేతలు తెరాస నేతలపై వ్యాఖ్యలు చేయడాన్ని వరంగల్​ జిల్లా తెరాస ఎమ్మెల్యేలు ఖండించారు. కాంగ్రెస్​ పార్టీని తాము టార్గెట్​ చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ఉనికే లేదన్నారు.

mla peddi sudarshan reddy comments on congress party
'మీ పార్టీని మేము టార్గెట్​ చేయడం లేదు'
author img

By

Published : Jan 2, 2021, 10:01 PM IST

కాంగ్రెస్ నేతలు తెరాస నేతలపై విమర్శలు చేయడంపై వరంగల్‌లో తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అరెస్టై వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. అతనిని పరామర్శించడానికి వచ్చిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు తెరాసపై విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ నేతలపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా హన్మకొండలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, స్టేషన్​ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీలు బండా ప్రకాశ్‌, దయాకర్​లు పాల్గొన్నారు. రాఘవరెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తుంటే అతనిని చూడటానికి రావడం సిగ్గు చేటని వారు అన్నారు.

ఎన్నికల లబ్ధి కోసం వరంగల్​కు వచ్చి తెరాస నేతలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జంగా రాఘవరెడ్డి జైలుకు వెళ్లిన విషయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పాత్ర ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని ఎద్దేవా చేశారు.

'మీ పార్టీని మేము టార్గెట్​ చేయడం లేదు'

ఇదీ చూడండి : పాఠశాలలు ప్రారంభించాలని మంత్రికి వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.