ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వరంగల్లో సీపీఎం ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదుట ధర్నాకు దిగారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఇంటర్ అవకతవకలపై నివేదిక సిద్ధం... మిగిలింది చర్యలే