వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు అనే రైతు... కామిండ్ల ఎల్లయ్యకు చెందిన పొలంలో కూలీ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. ఒక్కసారిగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని యజమాని ఎల్లయ్య నిర్లక్ష్యం కారణంగానే రాజు చనిపోయినట్టు తెలిపారు. పొలంలోనే శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు తప్పక న్యాయం చేయాలని కోరుతూ... ఆందోళనను విరమించారు.
ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు