వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాల విద్యార్థులు ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసి ఔర అనిపించారు. అధ్యాపకుల సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థులు 30 రోజుల్లో ఈ-బైకును రూపొందించారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనాన్ని రూపొందించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ వాహనాన్ని రెండున్నర గంటలు పాటు ఛార్జింగ్ చేస్తే సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని వివరించారు. తమిళనాడు కోయంబత్తూర్‌లో జరిగిన బైక్ ఈవెంట్‌లో విద్యార్థులు తయారు చేసిన వాహనానికి 24వ ర్యాంక్ రావడం పట్ల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 6జీ కోసం స్పీడు పెంచిన చైనా పరిశోధకులు!