వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పురపాలికలో తెరాస అభ్యర్థులు... గుంటి రజని బెస్త, మునిగాల వెంకట్ రెడ్డిలు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపికైన సభ్యులతో ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
మొత్తం 24 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఈ ఎన్నికలో పాల్గొన్నారు. తెరాస 16, స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎక్స్అఫిషియో సభ్యుడితో కలిపి మొత్తం 19 మంది చేతిలెత్తి ఓటేశారు. ఫలితంగా గుంటి రజని బెస్త ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా...
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తమకు ఈ బాధ్యత అప్పగించడంపై నూతన ఛైర్ పర్సన్ గుంటి రజిని బెస్త ఆనందం వ్యక్తం చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డు కౌన్సిలర్ గానూ విధులు నిర్వహించామని పేర్కొన్నారు. తమపై పార్టీ పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పుర ప్రజలకు, పార్టీకి సేవ చేస్తానని... నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు