ETV Bharat / state

సర్కారు బడి అంటే ఇట్లా ఉండాలే... - వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి

అధునాతన సౌకర్యాలు, డిజిటల్​ తరగతులు, 286 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు... ఇవన్నీ ఎక్కడో కార్పొరేట్​ బడి అనుకుంటున్నారేమో...! కాదు వరంగల్​ గ్రామీణ జిల్లా కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలోనే.

సర్కారు బడులంటే ఇట్లా ఉండాలే...
author img

By

Published : Mar 28, 2019, 11:55 AM IST

సర్కారు బడులంటే ఇట్లా ఉండాలే...
ప్రభుత్వ బడులంటే వసతులుండవా... ఉపాధ్యాయులు సమయానికి రారా... నాణ్యమైన విద్యాబోధన ఉండదా... సర్కారు బడులపై ఇవే మీ అభిప్రాయాలైతే... ఈ పాఠశాలను చూస్తే వెంటనే మారిపోతాయ్​. పిల్లలను ఇక్కడే చదివించాలని నిర్ణయానికి వచ్చేస్తారు. ఇదే వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

గతంలో ఈ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేవారు. ఉపాధ్యాయులు ఎంత కృషిచేసినా వసతులలేమితో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించేందుకు ముందుకు వచ్చేవారు కాదు.

డిజిటల్​ తరగతులు

విద్యాభివృద్ధితో పాటు వసతులపై దృష్టిసారించాలని కొండూరు పాఠశాల ఉపాధ్యాయులు నిర్ణయించారు. నిత్యం పాఠశాలకు హాజరై... విద్యార్థులను పూర్తిగా చదువు పైనే దృష్టిసారించేటట్లు చేశారు. అభయ ఫౌండేషన్​, స్మైల్స్​ సంస్థలు ముందుకు వచ్చాయి. డిజిటల్​ తరగతులకు పరికరాలు, ఇతర సదుపాయాలు కల్పించాయి. గ్రామస్థులు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు..

తమ ప్రభుత్వ పాఠశాలలో మేటి సౌకర్యాలు ఉండడంపై విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రసుత్తం ఇక్కడ 286 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులున్న సర్కారు బడిగా కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందింది.
ఇవీ చూడండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

Intro:tg_wgl_37_27_sawkaryala_paatashala_pkg_g2
controbutor_akbar_wardhannapeta_division
9989964722
( )ప్రభుత్వ పాఠశాలలంటే వసతులు సరిగా ఉండవు. ఉపాధ్యాయులు సమయానికి రారు. అనే అపోహలను తొలగించి. చేర్పిస్తే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చూపించాలని అనే పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల కృషి తో ప్రస్తుతం కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా మారింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 286 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత కొంతకాలం కిందట 50 లోపే వొచ్చేవారు. ఉపాధ్యాయులు విద్యాభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా నిత్యం పాఠశాలకు హాజరై గ్రామస్థుల్లో నమ్మకాన్ని కల్పించారు. పాఠశాలలో ప్రభుత్వం కొన్ని రకాల సౌకర్యాలు కల్పించగా కొందరు దాతలు సైతం ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇటీవల 100 స్మైల్స్, అభయ ఫౌండేషన్ వారు రూపాయలు 1.40 లక్షల విలువైన డిజిటల్ తరగతుల పరికరాలు అందించారు. దింతో విద్యార్థులకు సాంకేతిక విద్య అందుతుంది. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మారింది. ప్రాధమిక పాఠశాలల్లో అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాల గా జిల్లాలోనే గుర్తింపు పొందింది. పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు ఉండగా మరో 4 ఉపాధ్యాయులు డిప్యుటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అన్ని రకాల వసతులు కల్పించడం పై పలువురు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక విద్య అందించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
01 తరుణ్, విద్యార్థి
02 అశ్విని, విద్యార్థిని
03 రాజు, విద్యార్థి
04 వల్లాల సదానందం, ప్రధానోపాధ్యాయుడు

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.