కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా గడిచిన 10 రోజుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో ప్రధానంగా వర్ధన్నపేట, నర్సంపేట పరిధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాల రేటు పెరిగిపోతోంది. బాధితుల్లో చాలా మంది హోం ఐసోలేషన్లోనే చికిత్స తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుని స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోతున్నారు.
ప్రభుత్వం రెండు డోసులు వ్యాక్సిన్ వేస్తోన్న కేసులు తగ్గుముఖం పట్టడకపోవడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. రాష్ట్రంలో పకడ్భందీగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని కోరుతున్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియా వేదికగా కరోనాపై కాంగ్రెస్ పోరు!