ETV Bharat / state

'కరోనా సమస్యలుంటే ఫోన్​ ద్వారా సంప్రదించండి' - Establishment of Telemedicine Center

కొవిడ్​ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో కొవిడ్​ పాజిటివ్​ లక్షణాలు ఉన్నవారు లేదా అనుమానితులు హోం ఐసోలేషన్​ ద్వారా చికిత్స చేసుకోవచ్చు. అందుకోసం రాష్ట్రంలో జిల్లాల వారీగా టెలి మెడిసిన్​ సేవలు సహా సందేహాల నివృత్తి కోసం పలు సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు సౌకర్యాలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

warangal rural district corona problems, tele medicine services
'కరోనా సమస్యలుంటే ఫోన్​ ద్వారా సంప్రదించండి'
author img

By

Published : May 7, 2021, 10:19 AM IST

వరంగల్‌ రూరల్​ జిల్లా పరకాలలో టెలిమెడిసిన్‌ కేంద్రం చేశామని డాక్టర్‌ చల్లా మధుసూదన్‌ తెలిపారు. ఈ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ నంబర్‌ 7093772394 ద్వారా అవసరమైన సలహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో 4,672 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 90 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. పరకాలలో 6, వర్ధన్నపేటలో 10, నర్సంపేటలో 20 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవి అన్ని ఆక్సిజన్‌ పడకలే. ఎలాంటి ఇబ్బందులు లేవు. 17 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు 54, 491 మందికి ఇచ్చాం. కొరత ఏమీ లేదు. ప్రస్తుతం జిల్లాలో 3000 వయల్స్‌ ఉన్నాయి.
కిట్ల కొరత కూడా లేదు. అయితే లక్షణాలున్న వారికి మాత్రమే చేస్తున్నాం. ఇప్పటి వరకు 1,75,985 మందికి పరీక్షలు చేశాం.

- డాక్టర్‌ చల్లా మధుసూదన్‌

ఇదీ చూడండి: 'జిల్లాలో టెలి మెడిసిన్‌ కేంద్రం వినియోగించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.