నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరే దిశగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వనపర్తి పట్టణ శివారులోని నిర్మాణాలు పూర్తయిన 160 ఇళ్లను... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం... ఇళ్లకు సంబంధించిన పట్టా ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
వనపర్తి జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధి మంత్రి నిరంజన్రెడ్డితోనే సాధ్యమవుతుందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిరంజన్‌రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఇలాంటి నాయకుడు దొరకడం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.
అనంతరం పట్టణ శివారులోని గోపాల్పేట- హైదరాబాద్‌కు సంబంధించిన నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. చిట్యాల శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం పనులకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.