వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఓటు ఛాలెంజ్ విసిరారు. పురపాలిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ ఛాలెంజ్ తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ జిల్లా ఎస్పీ నారాయణకు ఛాలెంజ్‌ను విసిరారు.
ఎస్పీ నారాయణ ఓటు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. జిల్లాలోని పోలీస్ శాఖ అధికారులకు ఛాలెంజ్‌ను విసిరారు. తాండూరు ఆర్డీవో వేణుమాధవ్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, పురపాలక కమషనర్ మహ్మద్ సాబీర్ అలీ, తహసీల్దార్ చిన్నప్ప నాయుడు తదితరులు ఓటు ఛాలెంజ్‌ను స్వీకరించారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ