జిల్లాలోని మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా నూతన పరిపాలన అధికారి పౌసుమి బసు అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా సోమవారం పౌసుమి బసు బాధ్యతలు స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఆమెకు అధికారులు బొకేలతో స్వాగతం పలికారు. వివిధ విభాగాల అధికారులను కలిసి వారి శాఖల గురించి అడిగి తెలుసుకున్నారు.
కలెక్టరేట్ అంతా కలియతిరుగుతూ అన్ని కార్యాలయాలను పరిశీలించారు. ఫైళ్లన్నీ చిందరవందరగా ఉండటం గమనించి ఇక నుంచి చక్కగా పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. తాను కొత్తగా వచ్చినందున జిల్లావ్యాప్తంగా పర్యటించి... పరిస్థితులపై అధ్యయనం చేస్తానని... జిల్లా గ్రామీణ ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి!