వికారాబాద్ జిల్లా పరిగిలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి దంపతులు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాలతోపాటు పూల మెుక్కల కుండీలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమం నిరంతరంగా పది వారాల పాటు కొనసాగించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
ప్రతి ఆదివారం కేవలం పది నిమిషాల సమయం ఇంటి శుభ్రత కోసం కేటాయిస్తే మలేరియా, డెంగీ లాంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మహేశ్ రెడ్డి పేర్కొన్నారు.