వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, బిల్కల్ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో మొసలి కనిపించింది. గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది మొసలిని తాళ్లతో బంధించి సింగూరు డ్యామ్‌లో వదిలేశారు.

బిల్కల్ గ్రామంలో మొసలి కనిపించడం ఏడాదిన్నర కాలంలో ఇది రెండోసారి. సమీపంలో చెరువు ఉండడంతో అక్కడి నుంచి మొసళ్ళు ఊర్లోకి చేరుకుని ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి