ETV Bharat / state

ఫొటో, వీడియో గ్రాఫర్స్​కు ఉచిత శిక్షణ ప్రారంభం - కుల్కచర్ల తాజా వార్తలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​కు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మారుతున్న టెక్నాలజీని గ్రామీణ ఫోటోగ్రాఫర్లకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించామని ఎడిట్ పాయింట్ ఇండియా డైరెక్టర్ తెలిపారు.

photo and videographers training,  Kulkacharla Mandal
వీడియో గ్రాఫర్స్​కు ఉచిత శిక్షణ, కుల్కచర్ల మండలం
author img

By

Published : Apr 5, 2021, 8:58 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ఫొటోగ్రాఫర్లు ఎంతో అభివృద్ధి చెందాలని ఎడిట్ పాయింట్ ఇండియా డైరెక్టర్ రమేశ్​ అన్నారు. ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.

మారుతున్న టెక్నాలజీ వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా వస్తున్న కెమెరాలు.. వాటిని ఉపయోగించే విధానం తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఫొటోగ్రాఫర్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఛాయా చిత్ర ఫౌండేషన్ వారు జీవిత బీమా, హెల్మెట్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎడిట్ పాయింట్, ఫొటో టెక్ సంస్థల వీడియోగ్రాఫర్స్, ఫొటో గ్రాఫర్స్​కు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి సీఐ లక్ష్మి రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, భాజపా రాష్ట్ర నాయకుడు ప్రహ్లాదరావు, కుల్కచర్ల, దోమ, గండ్వీడ్ మండల ఫొటో గ్రాఫర్స్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరంలో 51 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.