ETV Bharat / state

భర్త అంతిమ యాత్రలో ఆగిన భార్య గుండె

60 ఏళ్లు కష్టసుఖాలను పంచుకుంటూ బతికిన ఆ దంపతులు మరణంలోనూ ఏకమయ్యారు. అనారోగ్యంతో తనువు చాలించిన భర్త మరణాన్ని చూసిన భార్యకు గుండె ఆగింది. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

wife died by husband death
భర్త మృతితో భార్య మృత్యువాత
author img

By

Published : May 1, 2021, 6:20 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బత్తుల వెంకయ్య(85), సోమమ్మ(75) వీరికి ఒక కుమారుడు. వెంకయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. భార్య సోమమ్మ కూడా వృద్ధాప్యంలో అచేతన స్థితిలో ఉంది.

ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం వెంకయ్య మరణించడంతో గ్రామస్థులు, బంధువులు కలిసి వెంకయ్య మృతదేహానికి దహన సంస్కారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర ముగించుకొని శ్మశానవాటికలో వెంకయ్య శవాన్ని చితిపై ఉంచి చివరి చూపుచూసేందుకు బంధువులతో పాటు భార్య సోమమ్మను శ్మశానవాటికకు ఆటోలో తీసుకొచ్చారు.

భర్తను చివరిచూపు చూసే సమయంలో భార్య సోమమ్మ అకస్మాత్తుగా గుండె ఆగిపోయి తనువు చాలించింది. ఈ విషాద ఘటనకు చలించిన గ్రామస్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం వెంకయ్య చితి పక్కనే మరో చితిని పేర్చి దంపతులిద్దరికీ అంతిమ సంస్కారం జరిపించారు.

ఇదీ చదవండి: ఈటల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.