సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఓ మహిళకు నిన్న కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు బాధితురాలిని ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాజిటివ్ మహిళ గ్రామంలో ఉంటే తమకు ప్రమాదమని అధికారులతో వాగ్వాదం చేశారు. ఎలాంటి ఇబ్బంది కలకుండా చుస్తామని పోలీసులు నచ్చజెప్పగా... నిరసనకారులు ధర్నాను విరమించుకున్నారు.