సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. మండల పరిధిలోని రైతులందరికి రైతుబంధు పథకం అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరుచేయాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోని భూసమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
ఇవీ చూడండి: విద్యార్థుల మృతిపట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి