పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు తెరాస ఫిర్యాదు చేసింది. కోదాడకు చెందిన ఉత్తమ్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. ప్రచార గడువు ముగిసిన తర్వాత హుజూర్నగర్ లో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మీడియా సమావేశం నిర్వహించారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. ఉత్తమ్‌పై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని తెరాస ఆరోపించింది. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌ను బయటకు పంపించాలని ఈసీని కోరింది.
ఇదీ చూడండి: ప్రగతిభవన్‌లో మంత్రి పువ్వాడ, వినోద్‌కుమార్ భేటీ