విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకోసం కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వ్యక్తిత్వ వికాస శిక్షకులు పూర్ణ శశికాంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. వసతిగృహంలో ఉండే విద్యార్థులు.. తమకున్న సమస్యలకన్నా లక్ష్యంపైనే ఆసక్తి పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో మంచి అవకాశాలను కల్పిస్తోందని.. వాటిని అందరూ సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండిః మేడిగడ్డ బ్యారేజీ క్యాంప్ కార్యాలయానికి కలెక్టర్లు