సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో తప్ప నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పద్మావతి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...