ETV Bharat / state

మఠంపల్లి ఎస్సైని సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ ఆందోళన

అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్​ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్​ స్టేషన్​ ముందు కాంగ్రెస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్సైని సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు.

congress leaders protest at matampally police station in suryapet district
ఎస్సైని సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ నేతల ఆందోళన
author img

By

Published : Jun 27, 2020, 5:31 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెరాస నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అసలు నిందితులను పక్కకు నెట్టి బాధితులపై కేసులు పెట్టి అభాసుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్​ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్​ రెడ్డి, జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్​ పాల్గొన్నారు.

ఎస్సై బయటకు రావాలంటూ మహిళలు, కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ చుట్టూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మోహరించారు. పోలీస్ స్టేషన్​ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను స్థానికులు చూసి అడ్డుకున్నారు. మఠంపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

ఇవీ చూడండి: వృద్ధులపై కబ్జాదారుల దాడి.. పోలీసులపైనా దౌర్జన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.