కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర (JanAshirvadYatra) రాష్ట్రంలోకి ప్రవేశించింది. విజయవాడ నుంచి సూర్యాపేట కోదాడ మండలం నల్లబండగూడెం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే... భాజపా శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేశాయి.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత వివేక్, తదితరులు... కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో కమలం పార్టీ కార్యకర్తలు... సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేతలంతా... కోదాడలోని రంగా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సభ వేదికకు చేరుకున్నారు.
మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు సాగనున్న యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. 12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 305 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రలో భాగంగా 40 చోట్ల సభలు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: Kishan Reddy Injure: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయం