సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఓ గర్భిణీకి అగన్వాడీ టీచర్లు అండగా నిలిచారు. ముత్యాలమ్మ గుడి వద్ద కుంభం వీరమ్మ అనే గర్భిణీకి అంగన్వాడి టీచర్లు ఆకుల రజిని, రేణుక నాగమణి రూ.3 వేలు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
వీరమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరమ్మకు ఓ కూతురు, ఓ కొడుకు ఉండగా.. ప్రస్తుతం గర్భవతి. వీరమ్మ గర్భంతో ఉండటం వల్ల పనికి వెళ్లలేకపోతోంది. భర్తకు కూడా పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని గుర్తించిన అంగన్వాడీ టీచర్లు తమ సొంత ఖర్చులతో తల్లి బిడ్డలకు కావాల్సిన వస్తువులు సరఫరా చేశారు.
ఇల్లు కూడ లేకపోవటం వల్ల వేప చెట్టు కిందనే వీరమ్మ కుటుంబం కాలం గడుపుతోందని టీచర్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరమ్మకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.