కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో గ్యాలరీల్లో పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగిందని సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అంబులెన్సులు, ప్రైవేటు, పోలీసు వాహనాల్లో బాధితులను తరలించినట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్కు తరలిస్తామని పేర్కొన్నారు.
పురుషుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో ప్రమాదం జరిగిందన్నారు. ఘటనపై కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. క్షతగాత్రుల తరలింపులో ఎస్పీ భాస్కరన్ స్వయంగా పాల్గొన్నారు.
ఇవీచూడండి: కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 150 నుంచి 200 మంది వరకు గాయాలు