ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సిద్దిపేట బస్ డిపో ఆవరణలో.... డ్రైవర్లు, కండక్టర్లు యూనిఫాం వేసుకుని నిరసన దీక్ష చేపట్టారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన సీఎం కేసీఆర్‌కు కార్మికుల సమస్యలు అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు దీక్ష ఆగదన్నారు. కేసీఆర్ మొండి వైఖరి వదిలి.... కార్మికులతో చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మకుండా చూస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'