రాష్ట్రంలో పాడి సంపద పెరిగి... రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన పశు వైద్య శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. తెలంగాణలో గత సంవత్సరం నుంచి 45 శాతం గొర్రెల సంపద, 5 శాతం పాడి పరిశ్రమ పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులు తెలంగాణ పథకాలు అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టాలని... కట్టిన వాళ్లకు త్వరలోనే గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, పశువైద్య అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ అగ్రగామి: కేటీఆర్