ETV Bharat / state

జీతాలు పెంచండి.. వేతన బకాయిలు ఇవ్వండి

వేతనాలు పెంచాలని.. బకాయి​లో ఉన్న జీతాలు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ఆశావర్కర్లు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆశావర్కర్లకు ఏపీలో అమలవుతున్న విధానాలు ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జీతాలు పెంచండి.. వేతన బకాయిలు ఇవ్వండి
author img

By

Published : Sep 20, 2019, 9:23 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ఆశావర్కర్లు వేతనాలు పెంచాలంటూ.. నిరాహార దీక్షలు చేపట్టారు. కనీస వేతనం 10వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నేత భాస్కర్ కోరారు. ఏపీలో కనీస వేతనం 10వేలు ఇస్తున్నారని.. ఆ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జీతాలు పెంచండి.. వేతన బకాయిలు ఇవ్వండి
ఇదీచూడండి:ధర్నాచౌక్​లో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

Intro:పెండింగులో ఉన్న పారితోషికాలను చెల్లించి, కనీస వేతనాలు ఇవ్వాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు.

Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీ కేంద్రంలో, మండల ఆశా కార్యకర్తలు పెండింగ్ లో ఉన్న పారితోషికాలను చెల్లించి, తమకు కనీస వేతనాలను ఇవ్వాలి అని సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా తెలంగాణలో ఆశా వర్కర్లకు పదివేల ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి. భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆ శాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం 18000 ఇవ్వాలని కోరుతూ 2015లో 106 రోజులు ఆశాలు సమ్మె చేశారు అని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం పారితోషకాలు మాత్రమే పెంచుతూ జీవో నంబర్ 167 తీసుకొచ్చింది అని ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, ఈ మధ్యకాలంలో పారితోషికాలు కూడా సరిగా రావడం లేదు అని దీనితో ఆశాలు ఇబ్బందులకు గురవుతున్నారని వీటిని వెంటనే పరిష్కారం చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

ఆశా కార్యకర్త మాట్లాడుతూ పారితోషకాలు పెంచుతున్నామని ప్రభుత్వం చెప్పిన అవి అంతంత మాత్రమే అని, మాకు కనీస వేతనాలు ఇవ్వాలి అని, ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగా ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలి అని, మా సమస్యలను పట్టించుకోవాలి అన్నారు.

Conclusion:రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మండల పరిధిలోని ఆశా కార్యకర్తలు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. భాస్కర్ పాల్గొన్నారు.

కిట్ నంబర్:1272, బిక్షపతి,దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.