ETV Bharat / state

CONGRESS CHALLENGE: సవాల్​కు సిద్ధం.. ఆదివారం 10 గంటలకు రండి

author img

By

Published : Aug 20, 2021, 5:09 PM IST

శ్రావణ శుక్రవారం వేళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. పట్టణ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్​ మహిళా కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. పట్టణ అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని.. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమని తెరాస నేతలు సవాల్‌ విసరగా.. కాంగ్రెస్​ నేతలు ఇలా స్పందించారు.

CONGRESS CHALLENGE: సవాల్​కు సిద్ధం.. ఆదివారం 10 గంటలకు రండి
CONGRESS CHALLENGE: సవాల్​కు సిద్ధం.. ఆదివారం 10 గంటలకు రండి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (husnabad) పట్టణ అభివృద్ధి విషయమై స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్ అనితకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి రూ.6 వేల కోట్ల నిధులు ఖర్చు చేశామని.. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమని మూడు రోజుల క్రితం తెరాస నేతలు (trs leaders challenge) సవాల్​ విసిరారు.

బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్​ నేతలు

దీనిపై స్పందించిన కాంగ్రెస్ (congress) నేతలు, కాంగ్రెస్​ మహిళా కౌన్సిలర్లు ఆదివారం (sunday) ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లను కోరారు. పోలీసుల అనుమతి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వివరించారు.

హుస్నాబాద్ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ (local mla sathish kumar) ఖర్చు చేసిన నిధుల గురించి చర్చించడానికి చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ తెరాస నాయకులను కోరారు. ఈ చర్చకు ప్రజలు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఏం అభివృద్ధి చేశారో చర్చిద్దాం..

తెరాస ప్రభుత్వం (trs government) హయాంలో హుస్నాబాద్​ అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని.. కావాలంటే చర్చకు సిద్ధమని అన్నారు. అందుకే ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు చర్చకు రావాలని కాంగ్రెస్​ తరఫున మున్సిపల్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​లకు బొట్టుపెట్టి ఆహ్వానించాం. పోలీసులు అనుమతితో, కొవిడ్​ నిబంధనల నడుమ చర్చకు ఏర్పాట్లు చేస్తాం. ప్రజల సమక్షంలోనే ఈ ఏడేళ్లలో వారు చేసిన అభివృద్ధి ఏంటో అడుగుతాం.-చిత్తారి పద్మ, మహిళా కౌన్సిలర్​, కాంగ్రెస్

మేం సిద్ధం.. మీరూ రండి..​

తెరాస నేతలు విసిరిన సవాల్​ను మేం స్వీకరించాం. వారు చెప్పినట్లుగానే అంబేడ్కర్​ చౌరస్తాలో ఈ ఆదివారం 10 గంటలకు చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. తెరాస అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. అభివృద్ధి పనులపై తెరాస నేతలు పూర్తి సాక్ష్యాలతో రావాలి. ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ (mla sathish kumar) ఏం పనులు చేశారో వివరించాలి. ప్రజా క్షేత్రంలోనే జరిగిన అభివృద్ధిపై చర్చిద్దాం. ఈ చర్చకు ప్రజలు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావాలి.-ఆక్కు శ్రీనివాస్, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు

ఇవీ చూడండి: Rahul Telangana Tour: కాంగ్రెస్​లో కొత్త జోష్... వచ్చే నెల 17న రాష్ట్రానికి రాహుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.