సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెరాస టిక్కెట్ నిరాకరణతో నిరాశ చెందిన మాజీ పట్టణాధ్యక్షుడు చిత్తారి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. పదేళ్లు తెరాసలో కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన వారికి టికెట్ ఇవ్వకుండా... కొత్తగా వచ్చిన వాళ్లకే ఇస్తున్నారని మండిపడ్డారు.
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్నారు. బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆధ్వర్యంలో 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇవీ చూడండి : తెరాసలో మేయర్ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి