భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దురుసు ప్రవర్తన పట్ల మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన వారి పార్టీ కార్యకర్త శ్రీనివాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భాజపా నాయకులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మరకత లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భాజపాపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలను ధరించి ఆందోళన చేశారు. శ్రీనివాస్ చర్యపై మంత్రి కేటీఆర్.. భాజపా నేడు డీజీపీ ఆఫీస్, అసెంబ్లీ ముట్టడి చేస్తొందనీ.. పోలీసులతో లాఠీ దెబ్బలు తినేలా, పైరింగ్ జరిగేలా ప్రయత్నం చేస్తారని ఒక్క తప్పుడు వార్త చెపుతూ, కార్యకర్తలను గురి చేస్తున్నారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. శవాల మీద పేలాలు ఏరుకునే నీచపు సంస్కృతి భాజపాకు లేదన్నారు.
తెరాస నాయకులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను సస్పెండ్ చేయాలని, భాజపాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'