భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న భాజపా నాయకులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం, బుధవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చట్టసవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కొంతమందికే లబ్ధి చేకూరుతుందని వారు విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాచరికాన్ని తలపిస్తున్నాయని, చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో భాజపా తగిన గుణపాఠం చెపుతుందని నాయకులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'అరెస్టుల పేరుతో భౌతిక దాడులు సరికాదు'